👉🏼నామినేషన్ల చివరి రోజు వరకు దరఖాస్తుకు అవకాశం
👉🏼తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు గడువును ఎన్నికల సంఘం పొడిగించింది.గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతో పలువురు పట్టభద్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా ఓటు హక్కు నమోదు చేసుకోలేకపోయిన పట్టభద్రులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
