Tnrnews.in
తెలంగాణ

ఓడినా.. జీవితంలో ఓడిపోలేదు బిగ్‌బాస్‌ నుంచి సూర్యాపేటకు వచ్చిన ఝాన్సీకి అభిమానుల ఘన స్వాగతం

బిగ్‌బాస్‌ కార్యక్రమంలో ఎనిమిది వారాల పాటు కొనసాగి ఎలిమినేట్‌ అయిన ఝాన్సీ సూర్యాపేటకు చేరుకోగా పట్టణ ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో లక్షలాది మందిలో తనను ఎంపిక చేశారంటే అది అభిమానులు తనపై చూపిన ఆదరాభిమానాలేనని అన్నారు. ఎనిమిది వారాల పాటు తనకు మద్దతుగా నిలిచి, ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినప్పటికీ జీవితంలో మాత్రం తాను ఓడిపోలేదని, అభిమానుల ప్రేమాభిమానాలే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. సూర్యాపేటలో భాను, శ్రీకాంత్‌ అందించిన మద్దతు, సహకారం ఎంతో ప్రత్యేకమని, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తరుణ్‌, రమేష్‌, సైదులు, హేమలతతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గురుకులాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి దినపత్రికలు. జిల్లా అదనపు కలెక్టర్ చేతుల మీదగా రాజముద్ర తెలుగు దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

TNR NEWS

బ్యాంకు అకౌంట్లు.. పాన్‌ నంబర్లు ఇవ్వండి.. ఎక్సైజ్‌ శాఖకు ఏసీబీ నోటీసులు

TNR NEWS

హైదరాబాద్: నేడు భారీ వర్షాలు

TNR NEWS

టీవీ ఏసి జేఏసీ నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS