దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనికోసం పంచాయతీరాజ్ శాఖ, సీఈఎస్ఎల్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఈ ఒప్పందం ద్వారా, పంచాయతీల ఖాళీ భూముల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల పంచాయతీలకు అదనపు ఆదాయం లభించడంతో పాటు, పెట్రోల్, డీజిల్పై ఆధారపడటం తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలో 29,151 పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఉండగా, ఈ సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే
లక్ష్యమని కేంద్రం తెలిపింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
