Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఆపదలో ఉన్నవారికి కాకతీయ సేవా సమితి అండగా ఉంటుంది

ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో సహకారం అందించి అండగా ఉంటున్నామని సేవా సమితి సభ్యులు తెలిపారు. బుధవారం బైపాస్ రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం వద్ద నిరుపేద కుటుంబాలకు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు, ప్రతిభ కలిగి చదువు దూరమైన విద్యార్థులకు 1,10,000 ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేసి మాట్లాడారు. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కులాలకు,మతాలకు అతీతంగా సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలిపారు. గతంలో కూడా ఎంతోమందికి తమ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా సహకారం అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెదనాటి వెంకటేశ్వరరావు, సురేష్, డాక్టర్ జాస్తి సుబ్బారావు, ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య, ఫారమౌంటు అధినేత వెనిగళ్ళ సురేష్, గంట సత్యనారాయణ కాకర్ల వెంకటేశ్వరరావు, బొల్లు రాంబాబు, భ్రమరాంబ,అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు………

Related posts

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

Harish Hs

పల్లె చుక్కయ్యను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి… 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత

TNR NEWS

ఎల్ ఓ సి అంద చేసిన జువ్వాడి కృష్ణారావు

TNR NEWS

సావిత్రీబాయి ఫూలే సేవలు మరువలేనివి

TNR NEWS

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ వాడకొప్పుల సైదులు 

TNR NEWS