Tnrnews.in
తెలంగాణ

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో ఈనెల 3,4 తేదీలలో హైదరాబాదులో జరిగిన తెలంగాణ ఏక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన 12 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన సందర్భంగా ఈరోజు సూర్యాపేట జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోచ్ పాలడుగు ఖ్యాతితో కలిసి క్రీడాకారులను ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ నెలలో బీహార్ రాష్ట్రం రాజ్ గిరిలో జరిగిన ఖేలో ఇండియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి టెక్నికల్ అఫీషియల్ గా ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ కోచ్ పాలడుగు ఖ్యాతిని ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అపాయింట్ చేసిన సందర్భంగా వారిని ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు ఎస్ ఆర్ కె మూర్తి, మేకల వెంకట్రావు, మల్లికార్జున్ రెడ్డి, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ ఓరుగంటి కిట్టు, కోచ్ లు పాలడుగు ఖ్యాతి, శివా తదితరులు పాల్గొన్నారు……..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

న్యాయమూర్తి పై దాడి హేయమైన చర్య

Harish Hs

పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞాన కేంద్రం ప్రారంభం

Harish Hs

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు

Harish Hs

ప్రజాసేవకు విరమణ ఉండదు

Harish Hs

రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలి

Harish Hs

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

Harish Hs