Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

కోదాడ పట్టణంలోని మున్సిపాలిటీ పక్కన గల మండపం ఏరియా బడ్డీ కోట్లను తొలగించాలంటూ పేద చిరు వ్యాపారులను మున్సిపాలిటీ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని బడ్డీ కొట్ల దుకాణదారుల సంఘం అధ్యక్షులు షేక్ నయీమ్, గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్యలు అన్నారు. బుధవారం మండపం ఏరియాలోని చిరు వ్యాపారులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు బడ్డీ కోట్ల ను వేసుకొని మున్సిపాలిటీకి పన్నులు కడుతూ ఉపాధి పొందుతున్నారని గతంలో అనేకమంది స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన దురాక్రమణ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారని అన్నారు. డబ్బా కొట్లను తొలగించి పేదల జీవనం మీద పొట్ట కొట్ట వద్దన్నారు. మున్సిపాలిటీ అధికారులు పేద చిరు వ్యాపారులను వేధించడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో కర్ల సుందర్ బాబు, షేక్ దస్తగిరి, రాజు, సైదులు, సింహాచలం, రావుఫ్, సైదులు, మౌలానా, మహమ్మద్, అబ్దుల్ రహీం, కృష్ణకుమారి,రాంబాబు,హుస్సేన్ బి, దస్తగిరి, గోపాలకృష్ణ, రాజు, నరహరి, ముస్తఫా, ఆరిఫ్,లక్ష్మీ,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు…

Related posts

అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు

Harish Hs

శ్రావణమాస మొదటి శుక్రవారం ప్రత్యేక పూజలకు పోటెత్తిన మహిళలు

TNR NEWS

సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం  ….. కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్

TNR NEWS

కొండపల్లి గ్రామస్తులకు,డ్రైవర్లకు,రోడ్డు సేఫ్టీపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహ సదస్సు… పెంచికల్ పేట్ ఎస్సై కొమరయ్య ఆధ్వర్యంలో..

TNR NEWS

విద్యా హక్కు చట్టం అమలు చేయండి – సమాచార హక్కు చట్టం సాధన కమిటీ – వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్

TNR NEWS

కాశిబుగ్గ వివేకానంద కాలనీలో పారిశుద్ధ పనులు 

TNR NEWS