Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రహదారుల అనుసంధానమే గ్రామాల అభివృద్ధి :సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య 

రహదారుల అనుసంధానమే గ్రామాల అభివృద్ధి రహదారులు ప్రజలకు అనుకూలంగా ఉన్నప్పుడే వారి వ్యాపారాలు, రాకపోకలు సజావుగా సాగుతాయని గ్రామ సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామానికి, కాపుగల్లు గ్రామానికి మధ్యలో గల అంతర్గంగా వాగుపై 1 కోటి 50 లక్షులతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గణపవరం గ్రామ సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డిలు పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దశాబ్ద కాలం రెండు గ్రామాల కల స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో తీరనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పట్టుదలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ బ్రిడ్జి సిఆర్ఆర్ 2024-25 నిధులతో ఎగ్జిక్యూటివ్ అండ్ చీప్ పిఆర్ఈడి హైదరాబాదు వారు నిధుల శాంక్షన్ తో బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే గణపవరం, కాపుగల్లు, సర్వేశ్వరాపురం, దొరకుంట, రెడ్లకుంట, కూచిపూడి, నల్లబండగూడెం, గ్రామాలకు ప్రజలు రాకపోకలు ఎంతో సులువుగా ఉంటుందని అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఈ ప్రాంత రైతులకు వారి పంటలను మార్కెట్ కి పంపడానికి ఎంత సులువుగా ఉంటుందని అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమాటి అనంతరామిరెడ్డి, ఉపసర్పంచి కోటేశ్వరరావు,మాజీ సర్పంచిలు తొండపు సతీష్, వి గురవయ్య, చిట్టా రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సింగారెడ్డి సుమన్ రెడ్డి, గిరిధర్, మాధవరావు, దేవాలయ చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి, ఇర్ల శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాసాని శ్రీను, జె నాగ ప్రసాద్, నాగేశ్వరరావు ధర్మకర్త కరుణాకర్ రెడ్డి, పోశం కృష్ణయ్య, పి శ్రీను, బొర్రా మధు,ఆదిరెడ్డి,ధనమూర్తి, కే వెంకటేశ్వర్లు, కాపుగల్లు వార్డు మెంబర్లు, గణపవరం వార్డు మెంబర్లు, రెండు గ్రామాల ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాల సురక్ష కార్యక్రమం సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ ఆవేర్నెస్ ప్రోగ్రాం.

Harish Hs

*రైతు పండుగ ప్రజా పాలన విజయోత్సవాలు* *పిఎసిఎస్ చైర్మన్ గూడూరు చల్లా లింగారెడ్డి ఆధ్వర్యంలో* 

TNR NEWS

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి

TNR NEWS

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సొంత భవనాలు : ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

Harish Hs

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

TNR NEWS

రేవంత్ రెడ్డి వద్దు…  మళ్ళీ కేసీఆర్ రావాలని-ఓ అవ్వ ముచ్చట

TNR NEWS