Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

డా.బి ఆర్అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి అన్నారు.అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా శుక్రవారం అనంతగిరి రిజిస్టర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మురళి డా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉండాలన్నారు.పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు.రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి వ్యక్తి అని కోనియాడారు.దళిత కుటుంబం నుంచి వచ్చి అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేద్కర్ నిలిచారు అంటూ ప్ర‌శంసించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నకిరికంటి కరుణాకర్, గరిడేపల్లి రాము కొత్తపల్లి ఉపేందర్,అడ్వకేట్ దావీద్,కాసాని వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS

ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం

Harish Hs

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించేలా చర్యలు….. ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ వికారాబాద్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించాలి వికారాబాద్ ఘటన పై నిరసన కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా రెవెన్యూ సిబ్బంది

TNR NEWS

డబల్ బెడ్ రూమ్ కోసం అర్హుడైన నిరుపేద ఎదురుచూపు* • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించాలి • ఇల్లు లేక బిక్కు బిక్కు మంటూ చీకట్లో జీవనం కొనసాగిస్తున్న భార్య పిల్లలు • 2019 లో ప్రభుత్వ ఇల్లు కోసం కలెక్టర్ కార్యాలయంలో జనహితకి దరఖాస్తు

TNR NEWS

పెద్దపల్లి లో బీఆర్ఎస్,సిపిఐ,బిజెపి నేతల ముందస్తు అరెస్టు..

TNR NEWS