రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జి సురేష్ రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుధాకర్ పీవీసీ కంపెనీ ఎంప్లాయిస్ కు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వాహనం నడిపే వ్యక్తితో పాటు,పక్కన ఉన్న వ్యక్తి తప్పనిసరిగ సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాలను నివారించుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా గ్రామాల, మండలాలలో వాహనదారులు రోడ్లు దాటేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా చూసుకొని రోడ్డు దాటాలని చెప్పారు.ప్రభుత్వం నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించాలని తెలిపారు. వాహనదారుడు తన వాహనాన్ని పార్కు చేసేటప్పుడు నిర్దేశిత పార్కింగ్ ప్రదేశంలో ప్రజలకు,ఇతర వాహనాలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ చేయాలని కోరారు.వాహనాల లైట్లను ఎక్కువ కాంతివంతంగా లేకుండా చూసుకోవాలని తెలిపారు.వాహనాలు యూటర్న్ తీసుకునేటప్పుడు ప్రమాదాలను నివారించడానికి సిగ్నల్ ఇస్తూ, ముందు వెనక చూసుకొని నెమ్మదిగా వెళ్లాలన్నారు. క్రమం తప్పకుండా కారు మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మోటార్ రవాణా అధికారి జయప్రకాష్ రెడ్డి, ఏ ఆదిత్య,సహాయ వాహనా అధికారులు పాల్గొన్నారు.