Tnrnews.in
తెలంగాణ

*ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం*

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ లకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు పిలుపునివ్వడంతో చేవెళ్ల డివిజన్ పరిధిలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు ఎర్రవల్లి శ్రీనివాస్, కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ పాల్గొని పలు ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయించి విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలలో, గురుకుల పాఠశాలలలో మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, నాణ్యతలేని భోజనం అందించడం వల్ల ఫుడ్ పాయిజన్ లు జరిగి విద్యార్థులు అనేక రకాలుగా అస్వస్థతలకు గురవుతున్నారని అన్నారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగానే వారికి నాణ్యమైన భోజనం అందించడం లేదని, ఫుడ్ పాయిజన్లు తరచుగా కావడం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి దారితీసిందన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు చరణ్ గౌడ్, బేగరి తేజ, చందు, సాయి గౌడ్, బన్నీ, అనిల్ కుమార్, బబ్లు, విష్ణు, ఇర్ఫాన్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

యూత్ కాంగ్రెస్, మండల అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి వివాహాది దినోత్సవ వేడుకలు

TNR NEWS

దివ్యాంగుల అనాధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేత

Harish Hs

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

తెలంగాణ – టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు  టర్కీ రాయబారి ఫిరాట్‌ సునెల్‌తో మంత్రి దామోదర్‌ భేటీ

TNR NEWS

ఘనంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు జన్మదిన వేడుకలు……….  కోలాహలంగా ఎర్నేని జన్మదిన వేడుకలు…..  ఎర్నేని జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం……

TNR NEWS

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా మీ కమిటీ పని చేయాలి…

TNR NEWS