Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బుధవారం మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై రూ. 50 లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ, సబ్సిడీ యేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ భయంతో ప్రజలు అల్లాడుతుంటే ఉపాధి పెంచి ధరలను తగ్గించాల్సింది పోయి,కేంద్రం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నదని విమర్శించారు. వెంటనే కేంద్రం గ్యాస్ సిలిండర్ పై పెంచిన 50 రూపాయలను తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వీరబోయిన వెంకన్న,సింగిల్ విండో డైరెక్టర్ వెంపటి వీరబ్రహ్మం,ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ ఖాజాబీ,సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శిలు, భూతం వెంకన్న,దైద సైదులు, డివైఎఫ్ఐ నాయకులు షేక్ ఖాదర్, డివైఎఫ్ఐ గ్రామ అధ్యక్షుడు దాసరి గురవయ్య, కార్యదర్శి వెంపటి స్టాలిన్,పార్టీ సభ్యులు కోడి వెంకన్న,కోడి లింగరాజు,నబి సాహెబ్, గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

చారిత్రాత్మకం కాంగ్రెస్ ప్రభుత్వ సన్నబియ్యం పథకం

TNR NEWS

ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

TNR NEWS

*సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు..!!*

TNR NEWS

గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ పై ప్రత్యేక దృష్టి – గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక చర్యలు – ప్రతిపక్షాలు విద్యార్థుల పట్ల రాజకీయాలు చేయొద్దు – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Harish Hs

బెల్లం చాయ్ తాగి చూడు బాయ్ –కోదాడలో క్యూ కడుతున్న చాయ్ ప్రియులు.  — ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.  — స్వయం ఉపాధి వైపు ఇరువురి సోదరులు అడుగులు  — బెల్లం టీ స్టాల్ తో లభిస్తున్న ఆదాయం  — నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువకులు….

TNR NEWS