Tnrnews.in
తెలంగాణ

విత్తనాల కొనుగోలులో.. అన్నదాతలు జర జాగ్రత్త

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ పంట దిగుబడి బాగా ఉండాలనుకుంటారు. దీనికి గాను రైతులు విత్తనాలు కొనుగోలుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.జాగ్రత్తలు తీసుకోకపోతే,తేరుకోలేని నష్టాన్ని చూడవలసి వస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.అంతేకాదు అధికారులు,శాస్త్రవేత్తల సలహాలు,సూచనలను ఆచరించినప్పుడే,సాగులో సంపూర్ణ విజయం సాధ్యమవుతుంది.అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడులు సొంతం చేసుకోవచ్చు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులు అప్రమత్తంగా ఉండి,సాగు మొదలు పెట్టాలి.వర్షాలు కురిస్తే చాలు రైతులలో హడావుడి మొదలవుతుంది. రోహిణి కార్తిలో విత్తనాల కోసం రైతులు విత్తన డీలర్ల దుకాణాల వద్దకు పరుగులు పెడతారు. పలు విత్తన కంపెనీలు డీలర్లకు ఆఫర్లు ప్రకటిస్తాయి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. ఫోటోలు చూపించి, ఆఫర్ల ఆశ చూపి వివిధ పట్టణాలకు కంపెనీవారు రైతులను తీసుకుపోవడం,గ్రామాల్లో తిరుగుతూ,విత్తన ప్యాకెట్లు బుక్ చేసుకోవడం చేస్తుంటారు.వాటికి దూరంగా ఉండటం మంచిదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.గ్రామాలలో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు మీకు అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాలి.పక్క జిల్లా,రాష్ట్రాల నుండి తీసుకొచ్చి,ఎవరైనా నకిలీ విత్తనాలు,లూజ్ విత్తనాలు అమ్మినచో సమాచారం ఇవ్వాలి.తొందరపడి లైసెన్స్ డీలర్ దగ్గర కాకుండా,ఇతరుల దగ్గర విత్తనాలు తీసుకొని ఇబ్బంది పడకూడదు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది

Harish Hs

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మంచి ఆలోచన

Harish Hs

దివ్యాంగుల అనాధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేత

Harish Hs

పార్దివ రథాల సంఖ్యను పెంచాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

యువత మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులకు దూరంగా ఉండాలి

TNR NEWS

కీర్తిశేషులు శ్రీమతి ఏలూరి పార్వతి ఐదో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

TNR NEWS