Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

జిల్లా అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నిక

పిఠాపురం : కాకినాడ జిల్లా నూతన బాక్సింగ్ అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్.ఆర్.ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సర్వ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులందరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్రకుమార్ ని సభ్యులందరూ ఏకగ్రీకంగా ఎన్నుకున్నారు. నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాల అందిస్తాను అని అన్నారు. అనంతరం సభ్యులందరూ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేంద్ర కుమార్ ను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సెక్రెటరీ రజిని, సభ్యులు కె.చిన్నబ్బాయి, జె.ప్రసాదరావు, పి.లక్ష్మణరావు, గణేష్, కృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత!.. ఈకేవైసీ తప్పనిసరి

TNR NEWS

పట్టభద్రుల పోలింగ్ లో ఆలోచించి ఓటేయాలి – – మాజీ ఎంపిటిసి పితాని వేంకట రాము విజ్ఞప్తి

Dr Suneelkumar Yandra

ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిన కండక్టర్

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన నాదెండ్ల మనోహర్

Dr Suneelkumar Yandra

కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక రంగాల్లో ఆచంద్రార్క యశస్విగా నిలిచిన వ్యక్తి కవి శేఖర డా. ఉమర్ ఆలీషా  – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా 

TNR NEWS