Tnrnews.in
ప్రత్యేక కథనం

కాసిన్ని నీళ్లు జల్లు

ఆ పసి నవ్వులలో ఏముంది

ప్రణమిల్లే దేవుని దైవత్వం తప్ప

 

వికసించే కుసుమాల మాటున ఆంతర్యం ఏమి

ప్రకృతిని చూసి పరవశించిపోతూ వేవేల రంగులను అద్భుతంగా అందించడం తప్ప

 

ఎగసే సంద్రపు అలల పరుగులు ఎంతవరకు

ప్రణయాన్ని నింపుకున్న హృదయావేదన అంతమయ్యే ఆచూకీ దొరికే వరకు

 

లోకమంతా లోపాలే

లక్ష్యంగా పరీక్షించి ప్రత్యుత్తరమెతికే

యువత నిద్ర లేచిందా అసలు

 

నివురు గప్పిన యోచనలు సమస్తాన్ని చుట్టేస్తుంటే

అద్వైతం అనంతమయ్యి కీర్తి ప్రతిష్ట చేస్తుంది

 

కాపాడే దైవత్వమే కనుమరుగవుతుంటే

కాసిన్ని నీళ్లు జల్లి మమ్ము మేల్కొలుపు కాలమా…

 

గీతికలెన్నున్నా

వెతికేది గమ్యమే

గొంతుకలెన్నున్నా గళమిప్పేది సత్యమే

గతించిన అవధులను నెమరు వేసుకుంటూ

గెలవాల్సిన క్షణాలను లెక్క పెట్టుకుంటూ

హృదయ గవాక్షాల నుంచి కొత్త ప్రపంచాన్ని వీక్షించుటకై

ఎదురుచూసే తపనలెన్నో

తనని తాను అర్పించుకుని

తుది వరకు సాగే జీవన బాటసారులెందరో

ఈ విజయ సామ్రాజ్యాన…

 

రచయిత : భాను తేజశ్రీ పోలగాని

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కొమ్ముల మధ్య నుంచి శివుడిని ఎందుకు దర్శించుకొంటారు

Dr Suneelkumar Yandra

జ్ఞాపకాల రూపమే – కవిత్వం

Dr Suneelkumar Yandra

TNR NEWS

నిలబడేనా ఇక – రక్త సంబంధాలు

Dr Suneelkumar Yandra

వృక్షో రక్షతి రక్షితః

ఎవరికి చేయాలి సన్మానం..!?

Dr Suneelkumar Yandra