Tnrnews.in
తెలంగాణ

మానవ జీవితంలో నడక చాలా ముఖ్యం – ఉడార్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా

హైదరాబాద్ : మానవ జీవితంలో నడక చాలా ముఖ్యం అని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఉడార్ట్) ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఆదివారం ఉదయం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కు వద్ద నిర్వహించిన 5కె రన్ ను ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజులో ఒక 30 నిమిషాలు నడక తప్పనిసరిగా నడవాలని, నడక ద్వారా మంచి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, రోజులో కొంత సమయం తమ తమ ఆరోగ్యం కాపాడు కోవడానికి యోగ, ధ్యాన, జ్ఞాన, ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా మానసిక ఆనందం కలుగుతుందన్నారు. దేహమే దేవాలయం అని అని ప్రతి ఒక్కరూ జీవించాలని ఆయా కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ జీవితంలో ప్రతీ సంవత్సరం మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, వాటి ద్వారా చక్కని ఆక్సీజన్ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ సర్టిఫికెట్, మెడల్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా చేతుల మీదుగా అందజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బీసీ రిజర్వేషన్ల అమలు కు 5న సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు 

TNR NEWS

ప్రతి ఒక్కరికీ మంచి ఆశయం,లక్ష్యం ఉండాలి

Harish Hs

కడుపు మండిన రైతు,, ధాన్యంలోడుతో రోడ్డుకి అడ్డంగా పెట్టి ధర్నా

Harish Hs

రాముల బండ లో మహిళ రైతు ఆత్మహత్య

TNR NEWS

పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు

TNR NEWS

ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలి…. సర్వే త్వరగా పూర్తి చేయాలి….. జిల్లా అదనపు కలెక్టర్…..పి రాంబాబు 

TNR NEWS