ప్రదేశం: పూరషోత్తమాయగూడెం
ఘనంగా నూకల నరేష్ రెడ్డి జయంతి వేడుకలు: డోర్నకల్ గడ్డపై ఆయన సేవలు చిరస్మరణీయం**
మరిపెడ పురుషోత్తమాయగూడెం స్వర్గీయ నూకల నరేష్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు, నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ… “డోర్నకల్ నియోజకవర్గం గడ్డపై నరేష్ రెడ్డి గారు అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆయన పదవుల్లో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజాసేవకే అంకితమయ్యారు. డోర్నకల్ ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది” అని కొనియాడారు.
ప్రతి కుటుంబంతో విడదీయరాని అనుబంధం:
నరేష్ రెడ్డి గారు కేవలం ఒక నాయకుడిగా కాకుండా, డోర్నకల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయారని అభిమానులు ఆవేదనతో గుర్తుచేసుకున్నారు. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండేవారని, ఆయన లేని లోటు డోర్నకల్ ప్రజలకు ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం, ఆయన చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.
