Tnrnews.in
తెలంగాణ

పతంగుల కోసం చైనా మాంజా వాడకం ప్రమాదకరం‌

పతంగులు ఎగరవేయడానికి వాడే చైనా మాంజా వలన ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది అని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ తెలిపినారు.సంక్రాంతి సందర్భంగా జిల్లాలో చిన్నపిల్లలు, పెద్దలు సరద కొరకు ఎగరవేసే పతంగులకు నైలాన్, సింథటిక్ తో తయారు చేసినా చైనా మంజా వాడడం, వాడి పడేయడం వలన ప్రజలకు, పక్షులకు ప్రమాదాల వాటిల్లే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలో చైనా మాంజా విక్రయాలు, వినియోగాల పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందనీ,ఎవ్వరయిన నిలువ ఉంచిన, తయారుచేసిన, అమ్మిన, అమ్మడానికి ఎవ్వరయిన ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడుననని తెలిపారు. చైనా మంజా చెట్లకు, ఎలక్రిక్ తీగలకు తగిలి వేలాడి ప్రజలకు మరియు జంతువులకు చుట్టుకుని ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఈ మాంజా తగిలి కొన్ని ప్రాంతాలలో ప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కావున విక్రయదారులు ఎవ్వరయిన చైనా మంజా నిలువచేసిన, అమ్మిన, వాడిన డయల్ 100 కి గాని సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగలరని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఐదేళ్ళలో కోటిమందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం : డాక్టర్ రామ్మూర్తియాదవ్*… *కాంగ్రెస్ విజయోత్సవ సభకు వరంగల్ తరలిన కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

20 నుంచి సర్వే వివరాల నమోదు..!! డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్‌ ట్రైనింగ్‌ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఆపరేటర్లు

TNR NEWS

దళిత ప్రధాన ఉపాధ్యాయులు రాములు పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి – ఉపాధ్యాయ, దళిత ప్రజా సంఘాల డిమాండ్

TNR NEWS

“ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రేపాల అధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ పై అవగాహన కార్యక్రమం “

Harish Hs

చిన్నపాటి వర్షానికే వీధులు బురదమయం

Harish Hs

చదువుతోపాటు, క్రీడలను ప్రోత్సహించాలి క్రీడలు మానసిక దృత్వానికి దోహదపడతాయి అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు

TNR NEWS