Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడంలో ఫార్మసీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది

కోదాడ లోని తేజ ఫార్మసీ కళాశాల లో విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి రెడ్డి అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా కోదాడ పట్టణ సీఐ టి.రాము హాజరై మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని,విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ తో చదివి ఆ లక్ష్యాలను సాధించాలని అన్నారు.ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా మహమ్మారి కి వ్యాక్సిన్ కనుగొనటంలో ఫార్మా రంగం కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు.కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు జన్మ నిచ్చిన తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని,విద్య నేర్పిన గురువులను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీ e వో యస్ యస్ రావు,శ్రీ సాయి వికాస్ డిగ్రీ,యం యస్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు పి.గంగాధర్ రావు ,యం.ప్రసాద్ ,అధ్యాపకు రాళ్ళు కవిత,సల్మా,సాహితీ,వీర కుమారి,అంజుమ్, నిఖత్,అమ్రీన్,రమాదేవి,అరుణ, సిబ్బంది ప్రవీణ,జి.నాగేశ్వర రావు,బి. నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు చైర్మన్, పందిరి నాగిరెడ్డి,సీ ఈ ఓ యస్ యస్ రావు లు బహుమతులు అందజేశారు.

Related posts

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

Harish Hs

ఆశ వర్కర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలి.  సర్వేలు ఆపేస్తాం  డిఎంహెచ్వో కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా.

TNR NEWS

సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!

TNR NEWS

గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటం…

TNR NEWS

ఇందిరా వృద్ధ అనాధ ఆశ్రమం సందర్శించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ చైర్మన్

TNR NEWS

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

Harish Hs