Tnrnews.in
తెలంగాణ

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుందని పలువురు కోదాడ మిత్రమండలి సభ్యులు తెలిపారు. గురువారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో మిత్రమండలి సభ్యులు ముత్తినేని సైదయ్య ఇటీవల ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా కోదాడ మిత్రమండలి సభ్యులంతా కలిసి వారి దంపతులకు శాలువా, పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ముత్తినేని సైదయ్య నిబద్ధత, అంకితభావంతో పని చేశారని వారి సేవలను కొనియాడారు. పదోన్నతి లభించడం విధి నిర్వహణలో బాధ్యతను మరింత పెంచుతుందని భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకొని ఇటువంటి పదోన్నతులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి అధ్యక్షులు మేకల వెంకట్రావు, ఎస్ ఆర్ కే మూర్తి, ముత్తవరపు పాండురంగారావు, పైడిమర్రి సత్తిబాబు, పట్టాభి రెడ్డి, పోటు రంగారావు, యలమందల నరసయ్య, నాగేశ్వరరావు, పాశం నాగిరెడ్డి, కరుణాకర్, శ్రీనివాసరావు, సత్తిపండు తదితరులు పాల్గొన్నారు………

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహిళల భద్రత కోసమే షీ టీమ్స్

Harish Hs

ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

TNR NEWS

పాడి రైతుల సంక్షేమానికి కృషి……..  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం……  రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి……  కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి……

TNR NEWS

యువకుడి అదృశ్యం

TNR NEWS

విద్యా హక్కు చట్టం అమలు చేయండి – సమాచార హక్కు చట్టం సాధన కమిటీ – వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్

TNR NEWS

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరం

Harish Hs