Tnrnews.in
తెలంగాణ

పెద్దగట్టు జాతరకు ఐదు కోట్ల నిధులు విడుదల ..!!

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దూరజ్‌పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది.

జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ..ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దగట్టు జాతర ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించాలని పూజారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తించబడిన పెద్దగట్టు జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో దూరాజ్‌పల్లిలోని పెద్ద గట్టు పరిసరాలు కుంభమేళాను తలపిస్తుంది. జాతరకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని,ఈ నేపథ్యంలో మౌలిక వసతులు,విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు తదితర ఏర్పాట్లకు నిధులు వినియోగించనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కానిస్టేబుల్ నరేష్ పై దాడి చేసిన వారిని‌ శిక్షించాలి

Harish Hs

*ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం* *ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం డాక్టర్ యమున ఆధ్వర్యంలో* 

TNR NEWS

హోరాహోరీగా కోదాడ ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

Harish Hs

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి  ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి 

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

TNR NEWS

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

TNR NEWS