ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని అసెంబ్లీలో సస్పెండ్ చేయడాని బిఆర్ఎస్ మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తు
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం నేర్చుకుంది రాష్ట్రంలో రైతంగం అనేక సమస్యలతో సతమతమవుతూ నీళ్లు లేక పొలాలు ఎండిపోతు ఒకవైపు, రైతు భరోసా లేక మరోవైపు, రెండు లక్షల రుణమాఫీ అందక ఇంకొక వైపు, ఎల్ఆర్ఎస్ కట్టమని ఇంకోవైపు, ఈ విధంగా ఎన్నికలలో ఆరు గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మభ్య పెట్టి, గెలిచిన కాంగ్రెస్ పార్టీ హామీలను గాలికి వదిలిపెట్టి, ప్రజలను ఆగం చేస్తున్నారు
మొన్న రవీంద్రభారతిలో హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మాట్లాడుతూ అబద్దాల”* ప్రాతిపదికన రాష్ట్రన్ని నడపాను”* అన్న మీ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 – హామీలను మరచి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి విధానాన్ని, అన్ని – ప్రజలందరు గమనిస్తున్నారు అబద్ధాల కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వాన్ని స్థానిక ఎలక్షన్లలో బొంద పెడతారని అన్నారు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి , ఉమ్మడి జిల్లా మాజీ కో అప్షన్ మెంబర్ సర్వర్ పాషా, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ సీనియర్ నాయకులు చెవుల మల్లేశం , మాజీ పట్టణ అధ్యక్షులు గూడూరి భరత , మాజీ మండల కో అప్షన్ మెంబర్ అన్వర్, మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి, కోడె శ్రీనివాస్ జాహింగిర్ తదితరులు పాల్గొన్నారు.