Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తూ ఆటోలను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామనీ ట్రాఫిక్‌ ఎస్సై మల్లేష్ హెచ్చరించారు. కోదాడ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ ఎస్సై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఆటోలు, మినీ టాటా ఏసీ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. హైవేలో వెళ్లేటప్పుడు యూటర్న్‌ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆటోలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారంఅందించాలన్నారు..ప్రజలకు ఇబ్బంది కలిగించే అకతాయిలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైవర్లంతా డ్రైవింగ్‌ లైసెన్స్‌-ఆర్‌సీ ఉంచుకోవాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు

Related posts

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు 

TNR NEWS

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS

సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి…సజ్జనార్ 

TNR NEWS

పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య…… కోదాడ ముస్లిం మైనార్టీ పాఠశాలకి దోమ తెర డోర్లు,ఐ ఐ టి, నీట్ ప్రవేశ పరీక్షలకొరకు బుక్స్, ఆర్వో వాటర్ ప్లాంట్, డిజిటల్ క్లాస్ ల కొరకు ప్రొజెక్టర్ ఏర్పాటు….. విద్య ద్వారానే సమాజం లో గుర్తింపు…… మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం….. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు…… రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి 

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

TNR NEWS