Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పహల్గాం లో ఉగ్రదాడి అమానుషం

జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ (ఐవివో) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారిపై కొవ్వొత్తులు వెలిగించి శాంతియుతంగా ర్యాలీ తీసి అమరులైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. అనంతరం ఉగ్రవాదం, మతోన్మాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పహల్గాం లో సామాన్య ప్రజలపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషం అన్నారు. దేశ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు, పి ఆర్ ఓ ఎస్ రమేష్, పాట్రన్స్ గుండపునేని నాగేశ్వరరావు, జగనీ ప్రసాద్, సెక్రటరీ ఉపేందర్, ట్రెజరర్ కె వెంకన్న, రహీం, గుండెపంగు రమేష్, హిందువులు, ముస్లిం సోదరులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు……….

Related posts

అంత్యక్రియలకు అడ్డుపడ్డారు.. సవరాలు బందు పెట్టాం… న్యాయం జరిగే వరకు శుభ,అశుభ కార్యాలకు దూరంగా ఉంటాం…

TNR NEWS

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా మల్గారి కార్తీక్ రెడ్డి

TNR NEWS

సాధారణ బదిలీల్లో భాగంగా పరిగి డిఎస్పి బదిలీ. వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.

TNR NEWS

పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్.

TNR NEWS

జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి కి ఘన సన్మానం మిత్ర బృందం ఆధ్వర్యంలో వంగవీటి కి ఘన సన్మానం

TNR NEWS

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS