Tnrnews.in
తెలంగాణ

కరివిరాలలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంలో భాగంగా కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు తన స్వగ్రామమైన కరివిరాల గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్నియుమరేషన్ (Enumeration) ప్రక్రియలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఎన్నియుమరేషన్ ఫారాన్ని పూరించి సంబంధిత అధికారులకు అందజేశారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR) తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించబడుతోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 సార్లు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం 14వ సారి చేపడుతున్నారు.ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ఓటర్లను చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం ద్వారా ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది.అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి సందేహాలు లేకుండా నిర్ణీత గడువులోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.అందువల్ల ప్రతి ఓటరు తప్పనిసరిగా SIR కార్యక్రమంలో పాల్గొని ఎన్యుమరేషన్ ఫారం నింపేలా, బూత్ ఏజెంట్లు చొరవ తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

TNR NEWS

బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాల్ రెడ్డి

TNR NEWS

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

ప్రజా వేదికఆధ్వర్యంలో ఉగ్రదాడి అమరులకు నివాళులు

Harish Hs

నిరాధార నిందలు వేసినా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరు

TNR NEWS