Tnrnews.in
తెలంగాణసినిమా వార్తలు

హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజు సందర్భంగా “సర్కారు బాయి” సినిమా పోస్టర్ రిలీజ్

హైదరాబాద్ : శ్రీరామ్ నిమ్మల హీరో, వర్షిక హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా “సర్కారు బాయి”. ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తూ నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలను దర్శకుడు లారా కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు జూన్ 26వ తేదీ హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తెలంగాణ పల్లె యువకుడిగా ఎంతో సహజంగా శ్రీరామ్ నిమ్మల కనిపిస్తున్నారు. “సర్కారు బాయి” సినిమా హీరోగా, నటుడిగా ఆయనకు మంచి పేరు తెస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం “సర్కారు బాయి” సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి అనే ఊరిలో “సర్కారు బాయి” చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ లెంగ్తీ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. హీరో శ్రీరామ్ నిమ్మల, హీరోయిన్ వర్షిక, ముఖ్య నటీనటులు బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, నుపూర్ ముఖర్జీ లపై సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. జూలై నెలాఖరు వరకు ఈ భారీ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం ‌

TNR NEWS

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి. – డివైఎఫ్ఐ డిమాండ్..

TNR NEWS

బెల్లంకొండ వెంకయ్య చిత్ర పటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs

లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ

Harish Hs

*అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి మృతి* 

TNR NEWS

మెద్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

TNR NEWS