Tnrnews.in
తెలంగాణ

నిత్య శ్రామికుడుమీలా సత్యనారాయణ జీవితం ఆదర్శనీయం…..  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట:తెలుగు రాష్ట్రాల పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పివిసి సంస్థ వ్యవస్థాపక అధినేత, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన దార్శనికుడు మీలా సత్యనారాయణ అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. గురువారం సుధాకర్ పి వి సి అధినేత మీలా సత్యనారాయణ 7వ వర్ధంతి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

సాధారణ కుటుంబ నేపథ్యం నుండి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, కష్టాన్ని నమ్ముకొని పారిశ్రామిక రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన మీలా సత్యనారాయణ సుధాకర్ పివిసిని దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటిగా తీర్చి దిద్దాడని అన్నారు. నాణ్యత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను సంస్థ అభివృద్ధికి పునాదులుగా నిలిపి, వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు.

వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా సూర్యాపేట పట్టణానికి రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి సూర్యాపేట పట్టణ అభివృద్ధికి ఎంతో సేవ చేశారని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన విశేష కృషి చేశారని అన్నారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సౌకర్యాల కల్పన వంటి అనేక రంగాల్లో సేవలందించి సమాజంలో చెరగని ముద్ర వేశారని అన్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే నిజమైన అభివృద్ధి అని ఆయన విశ్వసించేవారని గుర్తు చేశారు.

ఆయన చూపిన దారిలో నేడు సుధాకర్ పివిసి సంస్థ మరింత అభివృద్ధి చెందుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం ఆయన దూరదృష్టికి నిదర్శనం అన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమమని అన్నారు.మీలా సత్యనారాయణ ఆశయాల సాధనకు కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి ఎండి మీలా మహాదేవ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు కోట గోపి చెరుకు ఏకలక్ష్మి, కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, సుధాకర్ పివిసి మేనేజర్ శర్మ,సిపిఎం జిల్లా నాయకులు జె. నరసింహారావు, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దుచెయ్యాలి. 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి..     సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు..

TNR NEWS

75.భారత రాజ్యంగా దినోత్సవం

TNR NEWS

సీఎం సహాయ నిధి.. పేదలకు పెన్నిధి

TNR NEWS

వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి

Harish Hs

చారిత్రాత్మకం కాంగ్రెస్ ప్రభుత్వ సన్నబియ్యం పథకం

TNR NEWS

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

TNR NEWS