Tnrnews.in
తెలంగాణ

సర్ పేరుతో అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం….  *సిపిఎం వాణిజ్య భవన్ శాఖా కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ డిమాండ్

సూర్యాపేట:కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా సర్ కార్యక్రమం పేరుతో అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సిపిఎం వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో సర్ పేరుతో అర్హుల ఓట్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎన్నికల జాబితాల్లో పేర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.ప్రస్తుతం అమలు చేస్తున్న సర్ విధానం అనేక సందేహాలకు తావిస్తోందని అన్నారు.దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య శక్తులు ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు.

ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని కోరారు..ప్రతి ఓటరికి తగిన సమాచారం అందించి, అభ్యంతరాలు తెలిపేందుకు తగిన సమయం ఇవ్వాలన్నారు. ప్రజల ఓటు హక్కును హరించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్ట రాదన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత ప్రాథమిక రాజ్యాంగ హక్కు అని గుర్తు చేశారు. అందువల్ల ఎన్నికల సంఘం రాజకీయ పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ప్రజల్లో అనుమానాలకు తావులేకుండా సర్ ప్రక్రియను నిర్వహించాలని కోరారు.ఎన్నికల జాబితాల సవరణ పేరుతో ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరిగితే సిపిఎం తీవ్రంగా ప్రతిఘటిస్తుందని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిబంధనలను ఉపసంహరించుకోవాలని, లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు హాఫీస్ బాయ్, త్రివేణి, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

యువత స్వయంకృషితో నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాలి

Harish Hs

వేనేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్

Harish Hs

అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం…. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు

TNR NEWS

ప్రజల భద్రతకై పోలీసు తపన. – కుటుంబాల కోసం స్వియరక్షన జాగ్రత్తలు తప్పనిసరి. – ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరాలి. – క్రాసింగ్ ల వద్ద రోడ్డు దాటడంలో స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. -… నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.

TNR NEWS

కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి………  మౌలానా అబుల్ కలాం జీవితం ఆదర్శం……..  రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం ఏ జబ్బార్……….

TNR NEWS