Tnrnews.in
తెలంగాణ

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మూడు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

వాతావరణ శాఖ అందించే సమాచారం ప్రకారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల వద్ద ధాన్యం ఆరబెట్టుకున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని, ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

 

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ఎక్కడ వాహనాల కోరత ఉండవద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అనవసరమైన ఫైళ్లను, మెసేజ్లను ఓపెన్ చేయవద్దు

Harish Hs

ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి

TNR NEWS

ఇండియన్ బ్యాంక్ వారి తో సమావేశం నిర్వహించిన.. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్

TNR NEWS

చెరువుల మరమత్తుల పనులకు భూమి పూజ

TNR NEWS

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి రాజీ మార్గమే రాజమార్గం – ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం   – ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణ మాదిగ – ఎం ఎస్ పి రాష్ట్ర నాయకుడు మైస రాములు మాదిగ 

TNR NEWS