Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

వసుంధర తేజం గోవిందనామం – శ్రీవారిభక్తులతో గణపతిపీఠం లో73వ జపయజ్ఞ పారాయణ

కాకినాడ : వసుంధర తేజమైన ధరణిని రక్షించి పోషించే మూర్తిగా సమస్త దేవతా స్వరూప గోమాతలను కాచి పాలించిన వసుంధరునిని గోవిందా గోవింద అని మనసారా పిలిచే నామం అత్యంత  మహిమాన్వితమని గణపతి పీఠం పేర్కొంది. గోవింద నామాలు పఠిస్తే వేద పురాణ ఉపనిషత్తుల  విజ్ఞాన సర్వస్వం అవగతమవుతుందన్నారు.  సుప్రభాత వేళలో గోవింద నామాలు వింటే  ప్రగతికిసిద్ధి కలుగుతుందన్నారు. శనివారం ఉదయం కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి పాదాల వద్ద 73వ జపయజ్ఞ పారాయణ జరిగింది. శ్రీవారి తిరునామాన్ని ప్రతిష్టచేసి సహస్ర నామాలతో పూజించారు. మహిళ లకు రవిక,గాజులు, పసుపు, కుంకుమ కరతోరణతాంబూలాలు ప్రధానం చేసారు. కళ్యాణ  శ్రీకరం జరిగిన పెండ్లి కుమార్తెను చిరంజీవి సౌభాగ్యవతిగా పేరంటాళ్ళు ఆశీర్వదించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ  శ్రీవారి పాదాల వద్ద 7వారాల దీపారాధన చేసుకున్న 9మంది కన్యలకు  వివాహ మూహుర్తాలు శ్రీకరం అయ్యాయని తెలిపారు. మరో 35వారాలు పూర్తయిన తరువాత అక్టోబర్ ఆఖరివారంలో  శ్రీవారి భక్తులతో తిరుమల బస్సు యాత్ర జరుగుతుందన్నారు. శ జపయజ్ఞ పారాయణ లో బియ్యపు పిండి, బెల్లం, అరటిపండు గుజ్జు మిశ్రమంతో  తయారు చేసుకున్న 7ప్రమిదల్లో 7వారాల పాటు ఆవు నెయ్యితో దీపారాధన చేసిన దంపతులతో  శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల దివ్య కల్యాణాన్ని పీఠం నిర్వహిస్తుందన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బర్మాకాలనీలో సహస్రజ్యోతిర్లింగార్చన.. ద్వాదశజ్యోతిర్లింగాలు దైవికశక్తికి మూలాధారాలు

Dr Suneelkumar Yandra

విజయవంతంగా “ఇమేజ్ రీసెట్” వర్క్‌షాప్‌

TNR NEWS

ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు

Dr Suneelkumar Yandra

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS

ప్రజా సేవే పరమావధిగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs