Tnrnews.in
తెలంగాణ

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌

రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.ఆస్పత్రిలోని ఫార్మసీ, ప్రాథమిక పరీక్ష గది, గదులను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసి రిజిస్టర్ లో సంతకం చేసిన ప్రకారం వైద్యులు, సిబ్బంది ఉన్నారా ? లేదా ? అని చూశారు. ఆస్పత్రిలో వైద్యసేవల కోసం వచ్చిన పేషంట్ల తో ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా స్టాక్ పూర్తికాక ముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హమీలను నెరవేర్చాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

TNR NEWS

వారం రోజుల్లోగా మునగాల ప్రభుత్వ ఆసుపత్రి ఓపెనింగ్ : సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు

Harish Hs

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం

TNR NEWS

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

TNR NEWS

26 సంవత్సరాలుగా సేవలు అందించిన దక్కని గౌరవం

Venu

జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

TNR NEWS