Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

పీతల సత్యనారాయణ పదవీ విరమణ

పిఠాపురం : పిఠాపురం పట్టణానికి చెందిన పీతల సత్యనారాయణ గత 35 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో తరించి 30 సంవత్సరాలు సర్వే డిపార్టుమెంటులో విశిష్ఠ సేవలందించి, వృత్తిలో అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా పదవీ విరమణ సన్మాన మహోత్సవము కార్యక్రమం సహోద్యోగులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాను చేసిన సేవలకు ఎటువంటి రిమార్కు లేకుండా తన పదవి విరమణ చేయడం చాలా ఆనందంగా ఉందని, తనకు తోడ్పాటును ఇచ్చిన తోటి ఉద్యోగస్తులకు, అధికారులకు మరియు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసారు. పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో భాగంగా  పీతల సత్యనారాయణ, శాంతి కుమారి దంపతులను తహశిల్దార్ కార్యాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులు పూల మాలలు వేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో , ఆర్ఐ, ముండల ల్యాండ్ సర్వే ఆఫీసర్స్, జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం నాయకులు, తహశీల్దారు సిబ్బంది, వి.ఆర్.ఒ.లు & గ్రామ సర్వేయర్లు, సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గర్భాశయ సమస్యతో బాదపడుతున్న మహిళకి ఆర్థిక సహాయం

Dr Suneelkumar Yandra

మార్కెట్ యార్డ్ కార్య వర్గ సమావేశం

TNR NEWS

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు. జిల్లా డిఎంహెచ్వో వెంకట రవణ.

TNR NEWS

స్మార్ట్ సిటీ సమ్మర్ స్టోరేజ్ అవసరాలు తీర్చాలి – పౌరసంక్షేమసంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

కాకినాడ కార్పోరేషన్ ‘ట్రేడ్’ రాబడిపై నిఘా నిర్వహించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Reporter James Chinna