Tnrnews.in
తెలంగాణ

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్లేట్ ది స్కూల్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్ నాధ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అమృత రామానుజరావు ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ అనే అంశంపై ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి శేష ప్రసాద్ అధ్యక్షతన కళాశాల విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. సెమినార్ ను ఉద్దేశించి వాసిరెడ్డి అమర్ నాధ్ మాట్లాడుతూ ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భయం అవసరం లేదన్నారు. కాలంతోపాటు టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయని రానున్న రోజుల్లో ఏఐ లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుందని సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి భవిష్యత్తులో ఎలాంటి డోకా ఉండదన్నారు. సాంకేతిక విద్యలో నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలన్నారు. ఈ సెమినార్ లో కళాశాల డైరెక్టర్ నాగార్జున, ప్రిన్సిపల్ గాంధీ, కోమరగిరి రంగారావు, ట్రస్ట్ సభ్యులు కొండపల్లి శారద ప్రసాద్, కొండపల్లి శ్రీ వాత్సవ్, కొండపల్లి శ్రీకర్, న్యాయవాది అక్కిరాజు యశ్వంత్, కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు……….

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి.  ప్రజా వాణి పిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి.  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.

TNR NEWS

పట్టణ భూమిలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ ధర్మబిక్షం పేరు పెట్టాలి

TNR NEWS

జూలపల్లి లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు..

TNR NEWS

టాటా ఏసీఈ వాహనాలలో తరలిస్తున్న గోవులు పట్టివేత

Harish Hs

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS