Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వైభవంగా శ్రీశ్రీశ్రీ లక్ష్మి కోట మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం

  • కోదాడ పట్టణంలోని బొడ్రాయీ బజారులో ఉన్న శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి కోట మైసమ్మ తల్లి ఆలయం ఆరవ వార్షికోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపి ప్రత్యేక పూలతో అందంగా అలంకరించారు. పట్టణ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి కరుణాకటాక్షంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి పున: ప్రతిష్ట కమిటీ, రైతు కమిటీ, ముత్యాలమ్మ కమిటీ సభ్యులు ఆవుల. రామారావు,సట్టు. నాగేశ్వరరావు, మేళ్లచెరువు. కోటేశ్వరరావు, వి రవీందర్ రెడ్డి, పైడిమర్రి వెంకటనారాయణ, పైడిమర్రి. నారాయణరావు, తోట. శ్రీను,గంధం. రంగయ్య,పందిరి. సత్యనారాయణ, అబ్బాయి రాముడు, కోట వెంకటేశ్వరరావు, గంధం పాండు, ఆలేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు………..

Related posts

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS

మానవత్వం చాటుకున్న లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్

TNR NEWS

గడ్డి వాము దగ్ధం

TNR NEWS

నేటి నుంచి ‘గ్రూప్‌-4’ వెరిఫికేషన్‌..!!

TNR NEWS

ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవ్యానికి తీరని లోటు

Harish Hs