Tnrnews.in
తెలంగాణ

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలోని ప్రైమరీ స్కూల్ లో మొక్కను నాటిన మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లు,అలాంటిది మెుక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. వాతావరణం సమతుల్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.. పర్యావరణ రక్షణకు వర్షాలు సమృద్ధిగా కురవడానికి వృక్షాలు, అడవులు దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు బదులుగా చేతి సంచులు వాడాలని తెలిపారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా వేస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరేష్, ఏపీవో శైలజ, పంచాయతీ సెక్రెటరీ రజిత, ఎఫ్ ఏ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి

TNR NEWS

తపాలా శాఖ జీవిత బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

గ్రంథాలయానికి తాత్కాలి క మరమ్మతులు

Harish Hs

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా – వ్యక్తి మృతి

TNR NEWS

న్యాయవాది పై జరిగిన దాడికి నిరసనగా కోర్టు విధులు బహిష్కరణ

TNR NEWS