మునగాల మండలపరిధిలోని నేలమర్రి గ్రామంలో ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. అనుబంధ సంఘాల సూర్యాపేట జిల్లాఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, నేలమర్రి గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామశాఖతో సమావేశమై, ఈసందర్భంగావారు మాట్లాడుతూ, జులై 7న జరిగే 31 వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున మాదిగ వార్డులలో పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు, ఈకార్యక్రమంలో ఎం.ఎస్.పి.జిల్లా ప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మొలుగూరి శ్రీకాంత్, బచ్చలకూరి రామ్ చరణ్, రాంపంగు రమేష్,ఎమ్మార్పీఎస్ మండలనాయకులు బచ్చలకూరి సికిందర్, బచ్చలకూరి వెంకన్న, బచ్చలకూరి రాంబాబు, గ్రామ పెద్దలు యువకులు మహిళా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.