Tnrnews.in
తెలంగాణ

రణభేరి సభకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు

హైదరాబాదులో జరిగే వైశ్య రాజకీయ రణభేరి సభకు కోదాడ పట్టణం నుంచి ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న అన్ని ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ జనాభా ప్రాతిపదికన తమకు అవకాశాలు కల్పించాలన్నారు. ఆర్యవైశ్యులకు ఏ పార్టీలో అవకాశం కల్పించిన అందరూ కలిసికట్టుగా ఉండి గెలిపించుకోవాలని సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాలు, వ్యాపారాల్లో ముందున్న ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదిగినప్పుడే తగిన గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ విభాగం అధ్యక్షులు కుక్కడపు బాబు, ఉపాధ్యక్షులు బండారు శ్రీను, గరినే శ్రీధర్, ఓరుగంటి ప్రభాకర్, గురునాథం, గాదంశెట్టి శ్రీను, యాద సుధాకర్, పురుషోత్తం, పైడిమర్రి నారాయణరావు, వెంకటనారాయణ, వంగవీటి శ్రీను, పత్తి నరేందర్, నూనె నాగన్న, పైడిమర్రి సతీష్, వంగవీటి లోకేష్, నాగరాజు, చీదెళ్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు…………….

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

యూత్ కాంగ్రెస్, మండల అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి వివాహాది దినోత్సవ వేడుకలు

TNR NEWS

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS

చేర్యాల మున్సిఫ్ కోర్టు 29 ప్రారంభానికి చక చకా ఏర్పాట్లు

TNR NEWS

ప్రభుత్వ ఉపాధ్యాయుని గొంతుకు చుట్టుకొని కోసుకొని పోయినా చైనా మాంజా

Harish Hs

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS