Tnrnews.in
తెలంగాణ

జీవనది ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

  • పలువురు ప్రముఖులకు పురస్కారాల ప్రధానం

 

హైదరాబాద్, ఏప్రియల్ 15 : రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాదీపం డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్ లోని సూర్యలోక్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ హాల్ లో జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి ఆశీస్సులతో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా, గౌరవ అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ ఎం.విజయలక్ష్మి, ఆత్మీయ అతిథులుగా డిస్ట్రిక్ట్ సెక్రెటరీ లయన్ డాక్టర్ విజయ రంగా, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వి.ఎల్.కాంతి కృష్ణ, ఆంగ్ల అధ్యాపకుడు జి.రవికుమార్, ప్రముఖ తెలుగు దిన పత్రిక మాజీ ప్రొడక్షన్ ఇంచార్జి ఎన్.మధుసూదనరావు, పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ బాలకృష్ణ, మోటివేషన్ స్పీకర్ పి.ధనలక్ష్మి, బాగల లెక్సీ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకురాలు స్వప్న రాగి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎక్స్లెన్సీ అవార్డులతో సత్కరించారు. అనంతరం 12 పుష్కర పురస్కారాలు 2026తో మరికొంత మందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, జీవనది ఫౌండేషన్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీఎం సహాయ నిధి.. పేదలకు పెన్నిధి

TNR NEWS

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

Harish Hs

సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!

TNR NEWS

ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న 4గురు దొంగలు అరెస్ట్

Harish Hs

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS

కృష్ణ ఆయకట్టులో ఈసారి వానాకాలం వరిపంటకు నీళ్లు విడుదల అయ్యే అవకాశాలు లేవు.

TNR NEWS