Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విబిజిరామ్ జి బిల్లును వెంటనే రద్దు చేయాలి.  పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

సూర్యాపేట : వి బి జి రాంజీ బిల్లును రద్దుచేసి, పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిమట్టి పెళ్లి సైదులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట మండల7వ మహాసభకుఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి విబి జీవంజి పేరుతో కొత్త బిల్లును తీసుకొచ్చిందన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీకి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలను రెండు పూటలు ఫోటో తీయాలని ఆలోచనను విరమించుకోవాలన్నారు.మార్చి నుండిఆగస్టు వరకు ఉపాధి కూలీలకు సమ్మర్ అలవెన్స్ వర్తింప చేయాలన్నారు. ఉపాధి కూలీలను ఆదుకునేందుకుప్రభుత్వం 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వంసవరించిన వ్యవసాయ కార్మికుల వేతనాలను అమలుచేసి గ్రామ సభలు నిర్వహించి పెరిగిన కూలి రేట్లను గ్రామాలలో ప్రచారం చేయాలని కోరారు. 50 సంవత్సరాలు నిండినవ్యవసాయ కార్మికులకు 7500 రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన త్రాగునీరు, మెడికల్ కిట్టు, టెంటు, పారా, గడ్డపార వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. రెక్కల కష్టం నమ్ముకుని జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జబ్బు చేస్తే వైద్యం, వ్యవసాయ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి విద్య అందుబాటులో లేదన్నారు.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక….

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట మండల నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా సర్దార్ సైదులు, ఉపాధ్యక్షులుగా ఉయ్యాల పారిజాత, నల్ల మేకల అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా నోముల ధన మూర్తి, మండల సహాయ కార్యదర్శిగా జలగం సత్తయ్య, నెమ్మాది లాజర్, కప్పల పిచ్చయ్య, ఆది మల్ల చిన్న నాగయ్య, కోశాధికారిగా చెట్లేంకి రాజబాబు ఎన్నికయ్యారు.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు సర్దార్ సైదులు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మత్స్య కార్మిక సంఘం జిల్లా నాయకులు మేకన బోయిన శేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు మే రెడ్డి కృష్ణారెడ్డి, చిట్లింకి యాదగిరి, బోళ్ల నాగేందర్ రెడ్డి, సిఐటియు మండల నాయకులు సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నోముల ధనమూర్తి, లాజర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోదాడ పట్టణ, నియోజకవర్గ నిరుద్యోగులకు గొప్ప సువర్ణ అవకాశం

TNR NEWS

పార సీతయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం

Harish Hs

బిసీలకు 42% రిజర్వేషన్ల కొరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి  రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం అన్యాయం జన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు

TNR NEWS

సహాయ పరికరాల దరఖాస్తూ గడువు జూన్ 30 వరకు పొడగించాలి నోటిఫికేషన్ సవరించకుంటే ఆందోళన చేస్తాం.  ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ఉపాధ్యక్షులు జేర్కోని రాజు డిమాండ్

TNR NEWS

ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం

TNR NEWS

ప్రతి ఒక్కరికీ మంచి ఆశయం,లక్ష్యం ఉండాలి

Harish Hs