Tnrnews.in
తెలంగాణ

టీపీటీఎఫ్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బండారు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎఫ్) జిల్లా కార్యవర్గ సమావేశంలో బండారు శ్రీనివాస్‌ను జిల్లా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షులు రాపర్తి రామ నరసయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘ బలోపేతం, విద్యా సంవత్సర సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలుగా కుదించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

అనంతరం జరిగిన ఎన్నికల్లో బండారు శ్రీనివాస్‌ను నూతన జిల్లా అధ్యక్షుడిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

*నూతన అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ* “సంఘ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతగా పనిచేస్తాను. టీపీటీఎఫ్ సంఘ భవన నిర్మాణానికి అందరి సహకారంతో కృషి చేస్తాను. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, సామాజిక అంశాలపై పోరాటానికి నా వంతు పాత్ర పోషిస్తాను” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ భిక్షం, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న, పూర్వ అధ్యక్షులు పుప్పాల రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బడుగుల సైదులు, ఏ. హనుమంతరావు, చిరుగాని యాకయ్య, కార్యదర్శులు ఎల్. పెద్ది సుధాకర్ రెడ్డి, నల్ల చంద్రారెడ్డి, జిల్లా జానయ్య, పోతురాజు నరసయ్య, పోలిశెట్టి శ్రీనివాస్, దామెర్ల లాలయ్య, పూసపల్లి మల్లయ్య, తన్నీరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

డివైఎఫ్ఐ ఆద్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

TNR NEWS

భక్తిభావంతోనే శాంతియుత సమాజం నెలకొంటుంది  18వ పడి నారీ కాయల తోకల సైదులు గురుస్వామి

TNR NEWS

బాలలు తమ హక్కులను తెలుసుకోవాలి.

TNR NEWS

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

చేర్యాల మున్సిఫ్ కోర్టు 29 ప్రారంభానికి చక చకా ఏర్పాట్లు

TNR NEWS