ఆంధ్రప్రదేశ్లో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలవొద్దని అధికారులు సూచించారు.
