Tnrnews.in
తెలంగాణ

ప్రత్యేక ఓటర్ జాబితా సవరణకు రాజకీయ నాయకులు సహకరించాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ, ఓటర్ల జాబితా ప్రక్షాళన విజయవంతం అయ్యేలా సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. జూన్ 18న బూత్ లెవెల్ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ ఇస్తారని వివరించారు. జూన్ 25 నుండి జూలై 24వరకు బీఎల్ఓలు ప్రతి ఇంటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి వివరాలను సేకరిస్తారని, 2002 ఓటర్ల జాబితా ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 24 జూన్ 30వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడతారన్నారు. ఓటర్ల ముసాయిదా జులై 31న జాబితా ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారని అన్నారు. ఎవరైనా తప్పు సమాచారం ఇస్తే నేరుగా పేరు తొలగించకుండా, ముసాయిదా జాబితా తర్వాత నోటీసు ఇచ్చి, విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. వలస వెళ్లిన వారు, మరణించిన వారు, మరియు డూప్లికేట్ ఓటర్లను గుర్తించి జాబితా నుండి తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 31 ప్రకారం, ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం లేదా తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష, జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉందని తెలిపారు.ప్రస్తుత జాబితాలో పేరు లేని కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అయిన 01అక్టోబర్ 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారిన వారు ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.కార్యక్రమం లో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, జిల్లా రెవిన్యూ అధికారి డి. ప్రేమ్ రాజ్, రాజేశ్వర్ రావు, అంజాద్, ఐ ఎన్ సి, కరుణాకర్ రెడ్డి, సత్యనారాయణ బిఆర్ఎస్, బి జె పి అభిద్, గోపి సి పి ఐ (ఎం) స్టాలిన్ బి ఎస్ పి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS

ఇందిరమ్మ, రైతు బీమాకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

TNR NEWS

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

TNR NEWS

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

TNR NEWS

టియుటిఎఫ్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా జిల్లా వాసి…

Harish Hs