Tnrnews.in
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఉదార్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా

  • హైదరాబాద్, జూలై 05 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్ (ఉదార్ట్) డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఆదివారం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ సభ్యులు ఘట్టుపల్లిలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో 200 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా పాల్గొని మొక్కలు నాటడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. వాటి ద్వారా చక్కని ఆక్సీజన్ లభిస్తుందన్నారు. నేటి ఆధునిక సమాజంలో వాహనాల వాడకం ఎక్కువవ్వడం వల్ల కాలుష్య ప్రభావంతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ సభ్యులు, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ ఆశ్రమ సభ్యులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠి ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

TNR NEWS

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

TNR NEWS

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్స్ సేవలు అభినందనీయం

TNR NEWS

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్

TNR NEWS

నిత్య శ్రామికుడుమీలా సత్యనారాయణ జీవితం ఆదర్శనీయం…..  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

మిర్చి పంటకు కనీస మద్దతు ధర 25 వేలు ప్రకటించాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెల్లి సైదులు

TNR NEWS