Tnrnews.in
తెలంగాణ

పూరి గుడిసెల సర్వేలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్

ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని నర్సింహులగూడెం గ్రామంలో మంగళవారం పూరి గుడిసెల ఇళ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని నిరుపేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్) మమత పంచాయతీ కార్యదర్శి ఉదయ్ మరియు సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య ఉప సర్పంచ్ మొగిలిచర్ల సీతారాములు సంయుక్తంగా పాల్గొన్నారు.​ఈ సందర్భంగా వారు గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించి, అర్హులైన నిరుపేదలు నివసిస్తున్న పూరి గుడిసెలను, వారి నివాస స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో పారదర్శకంగా సర్వే నిర్వహించి, నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, తద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు.గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పంచాయతీ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని ఉప సర్పంచ్ మొగిలిచర్ల సీతారాములు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ సర్వే కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి విజయలక్ష్మి, మొగిలి చర్ల నాగరాజు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ.  అన్న ప్రసాద వితరణ

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

భారత పర్యటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలి

Harish Hs

హలో జర్నలిస్టు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి హైదరాబాద్ సచివాలయం మీడియా పాయింట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేసిన టిఎస్ జేఏ నాయకులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమిస్తూనే ఉంటాం రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

TNR NEWS