Tnrnews.in
తెలంగాణసినిమా వార్తలు

తెలుగు ఐకాన్ అవార్డ్స్ 2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, జూలై 19 : ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రచారం మీడియా, ఎంఎన్ సెలబ్రిటీస్ అండ్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న “తెలుగు ఐకాన్ అవార్డ్స్ 2026” పోస్టర్‌ను రాష్ట్ర నీటిపారుదల, ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు మరియు ఓటీటీ రంగంలోని ప్రతిభావంతులను సత్కరించే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రచారం మీడియా వ్యవస్థాపకుడు & సీఈఓ ఎండీ నాయుడు మాట్లాడుతూ ఆగస్టు 30, 2026న హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు ఐకాన్ అవార్డ్స్ 2026ను తెలుగు సినిమా మరియు ఓటీటీ రంగానికి ప్రతిష్టాత్మక అవార్డు వేదికగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

TNR NEWS

ఘనంగా డా ఉమర్ ఆలీషా జన్మదిన వేడుకలు

Dr Suneelkumar Yandra

ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలి… ప్రభుత్వం వెంటనే జాక్ తో చర్చలు జరపాలి.. భూపాల్ CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు 

TNR NEWS

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

Harish Hs

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

Harish Hs