Tnrnews.in
తెలంగాణరాజకీయం

డబల్ బెడ్ రూమ్ కోసం అర్హుడైన నిరుపేద ఎదురుచూపు* • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించాలి • ఇల్లు లేక బిక్కు బిక్కు మంటూ చీకట్లో జీవనం కొనసాగిస్తున్న భార్య పిల్లలు • 2019 లో ప్రభుత్వ ఇల్లు కోసం కలెక్టర్ కార్యాలయంలో జనహితకి దరఖాస్తు

 

చీదేల్ల గ్రామానికి చెందిన జేరిపోతుల భవాని భర్త జానయ్య కూలి నాలి పని చేసుకుంటూ పిల్లలతో

పూరిగుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. గత వర్షాల కారణంగా ఉన్న పూరిగుడిసె కూలిపోవడం జరిగింది.

వానలు వరదలు వస్తున్న తరుణంలో ఈ కుటుంబం అట్టి పూరిగుడిసెలో భార్య పిల్లలతో జీవనం కొనసాగించటం ఇబ్బందికరంగా మారింది. అప్పుడు ఆ కుటుంబం 2019లో కలెక్టర్ కార్యాలయంలో జనహిత లో డబల్ బెడ్ రూమ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇలాంటి దీనస్థితిలో ఉన్న ఈ కుటుంబానికి గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా? అర్హులైన ఈ కుటుంబానికి గత ప్రభుత్వాలలో ఇల్లు కూడా పొందలేక పోయారు.

ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికైనా ఇలాంటి అర్హులైన నిరుపేద కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించి వెంటనే ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూములలో ఒక ఇల్లుని ఈ పేదవాడికి మంజూరు చేసి ఆ కుటుంబానికి అండగా నిలుస్తారని ఎదురు చూస్తుంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

హైదరాబాద్ అడ్డాగా భారీగా డ్రగ్స్ రాకెట్!

Dr Suneelkumar Yandra

“ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాల మాదిరిగా ఎల్కేజీ,యూకేజీ,నర్సరీ, ప్రవేశపెట్టాలి”

TNR NEWS

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS

అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి

TNR NEWS

ఎమ్మెల్యే యాదయ్యకు సోయి లేదు బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ 

TNR NEWS

ఘనంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు

TNR NEWS