Tnrnews.in
తెలంగాణవిద్య

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం స్కాలర్‌షిప్‌ నిధులివ్వాలి కళ్లకు గంతలతో ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన

 

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌:

పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్‌ ఆరోపించారు. పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని బుధవారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ నెల రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇంకా విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోందని, దీంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. అటు చదువులు కొనసాగించలేక, ఇటు మధ్యలో ఆపేయలేక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండిరగులో ఉన్న స్కాలర్షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కసిరెడ్డి సందీప్‌ రెడ్డి, మచ్చ అభిలాష్‌, శ్రీనివాస్‌, నరేష్‌, సురేష్‌, రవి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు..*

Harish Hs

సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

బెజ్జుర్ మండలతహసీల్దార్ కు ఘోర అవమానం

TNR NEWS

మేధావుల సంఘీభావ సభకు తరలిరావాలి

Harish Hs

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత  గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి 

TNR NEWS

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS