Tnrnews.in
తెలంగాణ

*పిట్లం ఎమ్మార్వో ఆఫీస్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్*

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం

పిట్లం ఎమ్మార్వో ఆఫీసును బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తనిఖీ చేశారు. మండలంలోని చిల్లర్గి గ్రామంలో భూ వివాదం విషయం గురించి తహశీల్దార్ వేణుగోపాల్ ను వివరణ కోరారు. అనంతరం పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. గ్రామంలో 267 సర్వే నంబర్కు చెందిన వ్యవసాయ భూమి కోర్టు కేసులో ఉండడంతో ఆ భూమిని పరిశీలించారు. కోర్టులో దరఖాస్తు చేసిన రైతుతో పాటు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నత అధికారులకు అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఆమెతో పాటు ఎంపీడీవో కమలాకర్, డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది

TNR NEWS

*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా మట్టి పెళ్లి సైదులు ఎన్నిక…..* 

TNR NEWS

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

TNR NEWS

_బాలల దినోత్సవం_ నేటి బాలలే.. రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

Harish Hs