కోదాడ పట్టణంలోని ప్రమీల టవర్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాడ్జెట్ మొబైల్ జోన్ షో రూమ్ ను కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్, విజయవాడ వంటి ప్రముఖ నగరాలకు ధీటుగా మొబైల్స్ తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు తక్కువ ధరకే వినియోగదారులకు అందించేలా కోదాడలో షో రూమ్ ను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు కొల్లువాసు, అలీమ్ లను వారు అభినందించారు. అనంతరం షో రూమ్ లో వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులకు మొబైల్స్ లను అందించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి వస్తువు కొనుగోలు పై ప్రత్యేక డిస్కౌంట్లతో ఆఫర్లు ఉన్నాయని సులభ వాయిదాలలో తమ షో రూమ్ లో లభిస్తాయని వినియోగదారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షమ్మి, ఉద్దండు, తాజుద్దీన్,రఫీ తదితరులు పాల్గొన్నారు…………..