కాంగ్రెస్ టీపీసీసీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను బోథ్ నియోజకవర్గ కేంద్రం లో నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పసుల చంటి, ఆడే వసంత్, పోతారెడ్డి, రాజు రెడ్డి, మహమ్మద్, ఉమేష్, అబ్రార్, భోజన్న, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏలేటి రాజు రెడ్డి, మండల మైనారిటీ చైర్మన్ వకీల్, బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి , నేరడిగొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హీరా సింగ్, తదితరులు పాల్గొనారు
సోనాల మండల కేంద్రంలో
సోనాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయడం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ చెట్లపల్లి అనిల్. సోషల్ మీడియా కన్వీనర్ భక్తుల రమేష్, గాజుల పోతున్న, కసరి పోతున్న గంగారెడ్డి, అనిల్స, త్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.