తిరుపతి: ఏటీఎం చోరీకి విఫలయత్నం
తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. శ్రీఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. రాడ్లతో మిషన్ తెరెచేందుకు ప్రయత్నించారు. తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.